నీళ్లలో మునిగిపోతోన్న కొడుకును కాపాడాలనే సంకల్పంతో తల్లి ఏం చేసిందంటే….

తల్లి కొడుకుల పాత చిత్రం

మహా వెలుగు , సంగారెడ్డి : ఓ బిడ్డను కాపాడాలని సంకల్పం తో ఓ తల్లి కుంటలోకి దూకేసింది. బిడ్డ ప్రాణాలకు అడ్డం పడదామనే ఆత్రుతలో తనకూ ఈత రాదనే విషయాన్నే మర్చిపోయిందా తల్లి. చివరికి ఇద్దరూ చనిపోయిన సంఘటన నెలకొంది.

మహా వెలుగులో యాడ్స్ కోసం సంప్రదించండి చిన్న పెట్టుబడి పెద్ద పబ్లిసిటీ 8179394919

ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరు’ అని కేజీఎఫ్ కోసం హీరో యష్ స్వయంగా రాసి, చెప్పిన మాట అక్షర సత్యమని మనందరి జీవితాల్లో నిత్యం రుజువవుతూనే ఉంటుంది. బిడ్డల కోసం తల్లులు ఎంతలా ఆరాటపడతారో, పిల్లలకు ఆపదొస్తే శక్తికి మించి పోరాడుతారు కూడా. ఈ ఘటనలోనూ ఓ తల్లి అలాంటి పోరాటమే చేసింది. నీళ్లలో మునిగిపోతోన్న కొడుకును కాపాడాలనే సంకల్పంతో కుంటలోకి దూకేసింది. బిడ్డ ప్రాణాలకు అడ్డం పడదామనే ఆత్రుతలో తనకూ ఈత రాదనే విషయాన్నే మర్చిపోయిందా తల్లి. చివరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసకుందీ విషాదకర సంఘటన. స్థానిక ఎస్సై విజయకృష్ణ, గ్రామస్తులు చెప్పిన వివరాలివి.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తలారి బాలు(12) ఐదో తరగతి పూర్తి చేశాడు. బడులకు ఎండాకాలం సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటూ పనుల్లో తల్లికి సాయం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తల్లి తలారి లక్ష్మి(32) తో కలిసి పశువుల్ని మేపడానికి వెళ్లాడా బాలుడు. గ్రామ సమీపంలోన బురుగు కుంట (చెరువు కంటే చిన్నది) వద్దకు పశువుల్ని తీసుకెళ్లారు

బర్రెలు మేత మేస్తుండగా పిల్లాడు వాడిపక్కనే ఉన్నాడు. తల్లి లక్ష్మి కాసేపలా కట్టమీదికి వెళ్లింది. అప్పటిదాకా మేసిన బర్లు.. ఒక్కొక్కటిగా కుంటలోని నీటిలో స్నానానికి దిగాయి. బాలుడు బాలు కూడా వాటిని అనుసరిస్తూ లోనికెళ్లాడు. అయితే గతంలో పూడికలు తీయడంతో ఆ కుంటలో పెద్ద గుంటలున్నాయి. ఈత తెలీని బాలు గుంటలో పడి ఊపిరాడక చేతులు ఆడించాడు. ఆ దృశ్యాన్ని చూసి షాకైన తల్లి లక్ష్మి.. ఒక్క పరుగున కట్టమీద నుంచి పరుగెత్తుకొని వచ్చి అమాంతం నీళ్లలోకి దూకింది దీనితో ఇద్దరి ప్రాణాలు వదిలారు.