మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 27 : పెద్దపల్లి జిల్లా ధూళికట్ట గ్రామం దారి మైసమ్మ మూలమలుపు వద్ద గర్రెపల్లి కి చెందిన TS 22 టీ 7742 నెంబర్ గల ఇసుక ట్రాక్టర్అతి వేగం తో వస్తు ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి బోల్తా పడడం జరిగింది. అందులో ఉన్న మాదాస్ రంగనాథ్ అనే
యువకుడికి గాయాలు కావడం జరిగింది. ఇదే మూలమలుపు వద్ద గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి ఇట్టి ప్రమాదాలను నివారించడానికి ఆర్ & బి అధికారులు మూలమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలరని , ఇరు వైపులా స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయగలరని ధూళికట్ట ప్రజలు కోరుతున్నారు.

