వాట్సాప్ లో అనుకున్నారు కుటుంబానికి అండగా నిలిచారు

మహావెలుగు కురవి/ ఏప్రిల్27 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గత వారం రోజుల క్రితం కోత్తూరు (సి) గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వంగూరి చంద్రయ్య అనారోగ్యంతో మరణించడంతో దహన సంస్కారాల కోసం ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రామానికి చెందిన మలిశెట్టి వేణు దృష్టి కి మృతుని కుమారుడు వంగూరి నగేష్ తీసుకపోవడంతో స్పందించిన అయన ఆ గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడంతో స్పందించిన గ్రామ స్థులు వేణు మిత్రులు అందరూ కలిసి రూ.28వేల రూపాయలు వసూలు చేసి ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం ఈరోజు చేయటం జరిగింది.వాట్సాప్ గ్రూప్ ద్వారా స్పందించిన అందరికీ వేణు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు గ్రూప్ అడ్మిన్ వేణు కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూడి ఉపేందర్ రెడ్డి,మిర్యాల ఎల్లయ్య,అన్నెపర్తి మల్లయ్య,ఉప్పయ్య,రామ్ లక్ష్మణ్ లు పాల్గొన్నారు.