మహా వెలుగు, భీమారo : 27 స్వరాష్ట్ర సాధనకోసం గులాబీ జెండా ఆవిర్భవించిoదని గులాబీ జండా భారతదేశానికే దిక్సుచిగా ఎదిగిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో పార్టి 21 వ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ సమావేశంలో జడ్పీటిసి భుక్య తిరుమల,మార్కెట్ కమిటీ డైరెక్టర్ భుక్య రాజ్ కుమార్ నాయక్ పాల్గొనగా అనంతరం వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమ కారులకు , అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ అండగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

