- ఆరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మహా వెలుగు రిపోర్టర్ ప్రసాద్ అనుసూరి మంథని నియోజకవర్గం ఏప్రిల్ 28:
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధి మంథని మండలంలోని ఆరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించుకోవడం జరిగినది. మంథని మండలం సిరిపురం, మల్లారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిపి కొండ శంకర్, గుంజపడుగు, నాగెపల్లి వరి ధాన్యం కొనుగోలు జెడ్పీటీసీ సభ్యురాలు తగరం సుమలత, భట్టుపల్లి కేంద్రాన్ని రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ…ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర ఏ గ్రేడ్ కు రూ.1960, సాధారణ రకానికి రూ.1940 పొందాలని సూచించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు వహించాలని సెంటర్ ఇన్చార్జీలకు సూచించారు. సెంటర్ ఇన్చార్జీలు విధిగా రైతువారి కొనుగోలు, ట్రాన్స్పోర్టు, తదితర వివరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసుకోవాలని అన్నారు.
పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు గన్నీ బ్యాగుల కొరత, మిల్లర్ల నుండి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిమూర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి- పర్వతాల్ యాదవ్, దేవళ్ల విజయ్ కుమార్, సర్పంచులు దండె ప్రసాద్, మాసిరెడ్డి శ్రీకళ-జనార్ధన్ రెడ్డి, మానెం సత్యనారాయణ, దబ్బెట సరోజన- తిరుపతి, బందెల లక్ష్మణ్, ఎంపీటీసీలు గుమ్మడి సత్యవతి-రాజయ్య, ఊదరి లక్ష్మీ-లచ్చయ్య, ఏఎంసి డైరెక్టర్ గొబ్బూరి వంశీ, మాజీ ఏఎంసి డైరెక్టర్ పెండెం రాజేశం, ఉపసర్పంచులు సాదుల పద్మ-శ్రీనివాస్, గోదారి సతీష్, తాటి మధునమ్మ, సుమలత, తోటపల్లి రవి, లక్ష్మీ, నాయకులు మాసిరెడ్డి రాజేంద్రప్రసాద్, కొమ్మిడి తిరుపతి రెడ్డి, మానెం విస్సయ్య, ఆయా గ్రామాల ఉపసర్పంచులు, వార్డుసభ్యులు, సమన్వయ సమితి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
