గ్రామ గ్రామాన కార్మికులు ‘మే డే’ ఎర్రజెండాలు ఎగురవేయాలి

  • సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపు

మహావెలుగు కురవి/ఏప్రిల్28 రిపోర్టర్ చల్ల వేణు

మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులు హక్కుల పరిరక్షణ దినంగా గ్రామ గ్రమాన ఎర్ర జెండాలు ఎగుర వేసి జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.కురవి మండల కేంద్రం సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ మేడే గోడ పత్రికను ఆవిష్కరించిన సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల వీరోచిత పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు పాలకవర్గా లు కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని ఈ సందర్భంగా కార్మికులు సంఘటితంగా మేడే ఉత్సవాలను ఎర్ర జెండా లు వీధివీధిన ఎగురవేసి శ్రమజీవుల శక్తిని ఎలుగెత్తి చాటాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ కొరవి గ్రామ కార్యదర్శి తురక రమేష్, ఏఐటీయూసీ నాయకులు బొల్లం ఉప్పలయ్య, విజయ్, సైదులు, వెంకన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు .