- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య
వి.కపిల్ కుమార్ ,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్/ కేసముద్రం.27 : మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో పేద దళితులు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.పూసపల్లి గ్రామంలో నిరుపేద దళితులు గుడిసెలు వేసుకొని నివాసముంటున్న ప్రాంతాన్ని సందర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ ఏర్పడి సంవత్సరాలు గడిచినా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి దళిత గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమి ఇచ్చి వారి సాగుకు, విత్తనాలు ,బోరు, కరెంటు ప్రభుత్వ సమకూర్చి ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం అనే మాట నీటి మూటల అయిందని వారు ఎద్దేవా చేశారు .రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 9 లక్షల 50 వేల దళిత కుటుంబాలు ఉంటే అందులో మూడు లక్షలు పైగా కుటుంబాలకు సెంటు భూమి లేదని, మిగతా కుటుంబాలకు అరకొరగా మాత్రమే ఉందని, ప్రభుత్వం ప్రకటించింది. వీరికి భూమి కల్పిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆపని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆదివాసీలు, గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి వారి నుండి దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా వారికి హక్కు పత్రం ఇవ్వడం లేదని వారన్నారు. ఇప్పటికైనా ఒక్క పైసా ఖర్చు కాకుండా భూస్వాముల, ధనవంతుల ఆధీనంలో ఉన్న పోరంబోకు, బంచరాయి, ప్రభుత్వ భూములు పేదలకు సాగుకు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో లో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య , జిల్లా నాయకులు గొడిశాల వెంకన్న, గుడిసె వాసులు తదితరులు పాల్గొన్నారు.
