- ప్రభుత్వ పరంగా ఆదుకుంటా ఎంపీ మలోత్
మహా వెలుగు ,మహబూబాబాద్ స్టాఫ్ రిపోర్టర్ కపిల్ 28 : ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన శనిగకుంటలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో సుమారు 40 ఇండ్లు కాలిపోయాయి. దీంతో గిరిజన కుటు౦బాలు నిలువ నీడ లేకుండా, కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.
సంఘటన వివరాలు గ్రామస్థులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…… గురువారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో వీచిన గాలి దుమారంకు శనిగకుంట గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం, పొలాల వైపు నుండి మంటలు శనిగకుంట గ్రామంలోకి వ్యాపించాయి. దీంతో మంటలు గ్రామంలోని ఇండ్లకు అంటుకోవడం, ఇండ్లలోని గ్యాస్ సిలెండర్లు సైతం పేలడంతో

1. పెద్దల నర్సయ్య, 2. పసుల గడ్డయ్య, 3 తోలెం మునెమ్మ, 4. తోలెం చంద్రమ్మ, 5.మంకిడి రాంబాబు, 6. మంకిడి వీరయ్య, 7. తోలెం సమ్మయ్య, 8.మేసు లక్ష్మి, 10. తోలెం రాంబాబు, 11.ఎట్టి సమ్మయ్య, 12. తోలెం సుధాకర్, 13. తోలెం నాగబాబు, 14. తోలెం నర్సయ్య, 15.ఎట్టి బోడమ్మ, 16. తోలెం లక్మయ్య లకు చెందిన ఇండ్లతో పాటు సుమారు 40 ఇండ్లు అగ్నికి ఆహుతి కావడంతో గిరిజన కుటు-ంబాలు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.
ఒక వైపు గాలి దుమారం, కరెంట్ లేకపోవడం, మరోవైపు గ్రామంలో పెద్ద త్తున ఇండ్లు కాలిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గిరిజన కుటు-ంబాలు అల్లాడిపోయాయి. అగ్ని ప్రమాదం వలన ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరుగగా, ప్రాణ నష్టం మాత్రం జరగలేదని తెలుస్తుంది. రాత్రి వేళ కావడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, గాలి దుమారం కావడంతో పూర్తి వివరాలు శుక్రవారం ఉదయం కానీ తెలిసే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదంలో సర్వం కాలిపోవడంతో నిలువనీడ కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. కాగా ములుగు అడవుల్లో అంటుకున్న నిప్పు పాకాల అభయారణ్యం దాకా సాగుతోంది.
అదైర్యపడకండి.. ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం..
అగ్నిప్రమాద బాదితులకు దైర్యం చెప్పిన యంపి మాలోత్ కవిత..

మంగపేట మండలం నర్సింహాసాగర్ గ్రామ పంచాయతీపరిధిలోని శనిగకుంటలో అగ్ని ప్రమాద ఘటనపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తక్షణమే స్పందించారు. పార్లమెంట్ సభ్యుల స్టడీటూర్ లో బాగంగా ముంబైలో ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే పోన్ లో స్థానిక నాయకులతో, అధికారులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సొసైటీ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్ తో ఫోన్లో మాట్లాడి జరిగినప్రమాదం గూర్చి తెలుసుకున్నారు.
జిల్లా అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఆర్థిక సహాయాన్నిఅందేలా చూడాలని తక్షణమే సంఘటన స్థలానికి వెళ్ళి బాదితకుటుంబాలకు ఓదార్పు నందించాలని సూచించారు.
నిరాశ్రయులుగా మారిన వారిని ప్రస్తుతానికి స్థానిక పాఠశాలలో తలదాచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని బోజన,వసతి ఏర్పాట్లు చేయాలని స్థానిక నేతలకు సూచించారు. తాను ముంబై నుండి రాగానే ఘటనాస్థలానికి వస్తానని, ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పి బాదితులను ఎంపీ కవిత ఓదార్చారు.
