మే 6న, వరంగల్ లోరైతు సంఘర్షణ సభ ను జయప్రదం చేయండి. బయ్యారం కాంగ్రెస్ కమిటీ పిలుపు.

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/బయ్యారం.29: మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ముక్యనాయకుల సన్నాహక సమావేశం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి TPCC అర్గనైజింగ్ సెక్రెటరీ గుగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ మే 6న, TPCC ఆధ్వర్యంలో వరంగల్ లో హార్ట్స్ కాలేజీలో సాయంత్రం 5.00 గంటలకు రైతు సంఘర్షణ బహిరంగ సభను జయప్రదం కోసం పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలను రైతులను సహకరించాలని కోరారు.


ప్రజావ్యతిరేక విదానాలు అవలంబిస్తూ, రైతులను మోసం చేస్తూ, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న TRS పార్టీ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఎత్తి వేసి,రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తూ, రైతు బంధు పేర రైతుల్ని దగా చేస్తూ మభ్యపెడుతున్న TRS పార్టీని గద్దె దించే సమయం అసన్నం అయ్యిందని, రైతులకి గిట్టు బాటు ధర రావాలన్న, రైతు ప్రభుత్వం అంటే ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి లేదని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనీ, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లో అధికారము లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని,కేంద్రంలో BJP పార్టీని,రాష్టంలో TRS పార్టీని ప్రజలు నమ్మేపరిస్తితి లేదని అన్నారు.

ఈ సమావేశం లో మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ గోగినేని సీతారామయ్య,ST సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోత్ రాము నాయక్,మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్,సొసైటీ డైరెక్టర్లు జూలకంటి సీతారాంరెడ్డి,గాడుదుల కేతమల్లు,తగిర సత్తిరెడ్డి, కిసాన్ కేత్ మండల అధ్యక్షులు T.లింగయ్య,బండి యాదగిరి,ST సెల్ మండల అధ్యక్షులు అజ్మీరా రమేష్ తదితరులు పాల్గొన్నారు.