- పిచ్చి కుక్కలు కరుస్తున్నాయి
ఇండ్లలో హల్ చల్ చేస్తున్నాయి - అయినా అధికారులకు పట్టింపు కరువు
- చూసి చూడనట్టు , మన ఇంట్లో వారికి జరగనట్టు వ్యవహరిస్తున్న అధికారులు , పాలకులు
మహా వెలుగు, భీమారo : పిచ్చి కుక్కలు ఇండ్లలో భయాందోళనలకు గురి చేస్తూ ఇండ్ల లోనే స్వైర వ్యవహారం చేస్తున్నాయి. అయిన అధికారులకు పాలకులకు పట్టింపు కరువైంది.
ఈ వారం వ్యవధిలోనే జయశంకర్ కాలనీ చెందిన bukya రాజు నాయక్ , రావి చెట్టు వాడకు చెందిన ఐటి పాముల సురేష్ కూతురు చిన్నారిని నడుము భాగంలో తీవ్రంగా గాయపరిచింది. అదే కాలనీ కి చెందిన మచ్చ కాంతమ్మకు సైతం శుక్రవారం చేతి భాగ భాగం లో కoడను కొరికింది.

జయశంకర్ కాలానికి చెందిన దేవేందర్ పైకి కూడా కుక్కలు వచ్చి బెదిరిచాయి. అధికారులు మాత్రం సోయి సొoపు లేకుండా వ్యవహరిస్తున్నారు. భీమారం మండల వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే ఉన్నా అటు పాలకులు కానీ ఇటు అధికారులు గాని పట్టించుకోవడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మధ్య పాలకుల మధ్య కోఆర్డినేషన్ లేకనే…
అధికారుల మధ్య పాలకుల మధ్య కోఆర్డినేషన్ లేకనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉంటేనే సమస్యలు తెలుస్తాయని కానీ ఇక్కడకు చుట్టం చూపు లాగా వచ్చి వెళుతున్న అధికారులకు ఏం తెలుస్తుందని ప్రజలు మండిపడుతున్నారు.

రెండు నెలల క్రితమే చెప్పిన మహా వెలుగు
‘కుక్కలకు వింత వ్యాధి సోకి ప్రజలకు ఇక్కట్లు’ అనే శీర్షిక ను మహా వెలుగు ఫిబ్రవరి 27 రోజున ప్రచురణ చేసింది. కాగ అప్పుడు కుక్కలు ఇండ్ల లో స్వైరవిహారం చేశాయ్ తప్ప ఎవరిని గాయపర్చలేదు. కానీ కుక్కలకు ఇప్పుడు వ్యాధి ముదురి గాయపరుస్తున్నాయి. అప్పుడు అధికారల తో పాటు పాలకులు పట్టించు కొని , లైట్గా తీసుకోవడం తోనే ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది.
వాటికి ఇంజక్షన్లు వేయించాలి
కుక్కలకు ఇంజక్షన్ లతోపాటు వాటిని వేరే చోట వదిలేసి రావాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా ఉంటే చిన్న పిల్లలతో పాటు పెద్దలకు సైతం ప్రాణ హాని ఉంటుందని ప్రజలు ఆరోపించారు.
