వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/బయ్యారం.29 : మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ చేపూరి మౌనిక కుల దృవీకరణ పై వచ్చిన అనుమానాలపై గతంలో జిల్లా కలెక్టర్ శశాంక ఆమె ఎస్ టి కులానికి చెందినది కాదు అని ఇకపై ఆమెకు కుల దృవీకరణ మరియు బయ్యారం మండలం ఎంపీపీ గా కొనసాగబోరు అని జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ శశాంక ఇచ్చిన ఉత్తర్వుల పై చేపూరి మౌనిక హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకున్నారు.

ఈ స్టే ప్రకారం మౌనిక బిసి కులానికి చెందినది కాదని ఎస్ టి కులానికి చెందని, ఇకపై తను బయ్యారం ఎంపీపీగా తరువాతి ఉత్తర్వులు వచ్చేంత వరకూ కొనసాగుతుందని దాని అర్థం.
ఇకపై బయ్యారం మండల టిఆర్ఎస్ వర్గ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయని పలువురు రాజకీయ మేధావులు అభివర్ణించారు.

