ములుగు గిరిజనులకు అండగా మేము సైతం బయ్యారం ‘చేతన ఫౌండేషన్’

వి. కపిల్ కుమార్. మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ బయ్యారం 29 : ములుగు జిల్లా మంగపేట అరణ్యం లో కార్చిచ్చు వల్ల నష్టపోయిన గిరిజనుల కు మేము ఉన్నాము అంటూ చేతన ఫౌండేషన్ బయ్యారం వారు సంఘటన స్థలం వద్ద స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో 16 వేల రూపాయల దుప్పట్లు, రెండు వేల మూడు వందల రూపాయలు కూరగాయలు దుస్తులు ఇతరత్రా మొత్తం 36 వేల రూపాయలు వెనువెంటనే తమ వంతు సహకారాన్ని అందించారు.

అలాగే క్యాన్సర్ ఉన్న వారికి ఉచితంగా ఈనెల 30వ,తేదీన ఖమ్మం జిల్లాలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ టెస్ట్ లు అందించబోతున్నారు.

ములుగు శరణార్థులకు సహాయం కోసం తమ వంతు సహాయ సహకారాలు కొనసాగుతాయని చేతన ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా సహృదయులు చేతన ఫౌండేషన్ ద్వారా వారికి ధన రూపేనా, వస్తు రూపేనా సహాయం చేయదలుచుకుంటే ఫౌండేషన్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేశారు.

ములుగు సంఘటన తెలిసిన వెంటనే చేతన ఫౌండేషన్ తన వంతు సహాయం చేస్తూనే ఇతర ఫౌండేషన్ లకు సమాచారం ఇవ్వగా సోనూసూద్ ఫౌండేషన్ వారు చేతనా ఫౌండేషన్ సౌజన్యంతో వారి సహాయార్థం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారని చేతన ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బయ్యారం మరియు గార్ల మండలాల నిర్వాహకులు పాల్గొన్నారు.