గొర్ల కాపరికి కరెంట్ బిల్ @ రూ. 46610

  • గోడు వెల్ల పోసుకుంటున్న బాధితుడు ..
  • ఇప్పటి వరకు స్పందించని విద్యుత్ ఉన్నత అధికారులు

మహా వెలుగు ,భీమారo 1 : మంచిర్యాల జిల్లా భీమారo మండలంలోని స్థానిక జయశంకర్ కాలనీ లో నివాసo ఉంటున్న ఇంటికి రూ. 46610 ల విద్యుత్ బిల్లు వచ్చింది. దీనితో ఆ ఇంటి యజమాని కగ్గుతిన్నారు.

ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బాధితులు

భీమారo మండల కేంద్రం లో నివాసం ఉంటున్న తమ్మన వేణి శ్రీనివాస్ గోర్లు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ కొడుకు తమ్మని వేణి సంతు ఆటో డ్రైవర్ గా చేస్తున్నాడు. వారికి ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా విద్యుత్ బిల్లు రూ.46610 రావడం తో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఎప్పటి లాగే విద్యుత్ వినియోగిస్తున్న అంత బిల్లు రావడం ఏంటి అని అధికారులను సైతం ప్రశ్నించారు. కానీ అధికారులు వారం గడుస్తున్నా ఇప్పటి వరకు దానికి స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ అధికారులు ఇచ్చిన కరెంట్ బిల్లు

రెండు ఫ్యాన్స్ , రెండు లైట్లు ,ఒక్క ఫ్రిడ్జ్ వినియోగిస్తున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. అయిన అంత విద్యుత్ బిల్లు రావడం ఏంటి అని ప్రశ్నించారు. తాము గొఱ్ఱల కాపరి అని , తమ కొడుకు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

బాధితుడు తమ్మన వేణి సంతు