- డా౹౹చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు లిక్విడ్ గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారని తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్,ఎస్పీ తక్షణమే చర్యలు చేపట్టాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.
నరసరావుపేట పట్టణంలో స్థానిక 33 వార్డ్ వ వార్డ్ లోని బరంపేట నందు శనివారం సాయంత్రం ప్రజా చైతన్య నిర్వహించారు.ఈ ప్రజా చైతన్య యాత్రకి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ ప్రజా చైతన్య యాత్రలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గడపగడపకు బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి విధిస్తున్న విద్యుత్ కోతలు,అధిక ధరలు,పన్నులు గురించి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు లిక్విడ్ గంజాయి నుండి మా పిల్లలను కాపాడమంటూ తమ వద్ద కాళ్ళా,వేళ్ళా పడుతున్నారని వైసీపీ నాయకుల కనుసైగల్లోనే ఈ వ్యాపారం కొనసాగుతుందని వారు తమకు చెప్పి వాపోయారని తెలిపారు.అన్నీ అక్రమ వ్యాపారాలకు అడ్డా అయిన నరసరావుపేట లిక్విడ్ గంజాయికి కూడా అడ్డాగా మారిందని తక్షణమే ప్రత్యేక బృందాలతో విచారణ జరిపి కలెక్టర్,ఎస్పీ చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని కోరుతున్నామన్నారు.విద్యార్థులకు చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నానని ఏ ఒక్క విద్యార్థి కూడా లిక్విడ్ గంజాయి బారినపడి భవిష్యత్ ను అంధకారం చేసుకోవద్దని కోరారు
బతుకుదెరువు కోసం ఎంతో మంది రకరకాల చేతి వృత్తుల పై జీవిస్తుండటం మనమంతా చూస్తున్నామని నరసరావుపేటలో వైసీపీ నాయకులు మాత్రం విద్యార్థుల భవిష్యత్ ను లిక్విడ్ గంజాయి వ్యాపారం ద్వారా నాశనం చేస్తున్నారని విమర్శించారు.అధికారులు ఇటువంటి అక్రమ వ్యాపారం పై ఉక్కుపాదం మోపి అంతమొందించాలని కోరారు.నరసరావుపేట కేంద్రంగా గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుటవలనే యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఇంత భారీ ఎత్తులో నరసరావుపేటలో గంజాయి వ్యాపారం ఎవరు నిర్వహిస్తున్నారనే విషయం పై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్ఠి సారించి యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలన్నారు.
ఈ విధంగా మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసే వారి పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని డా౹౹చదలవాడ అధికారులను కోరారు._