హైదరాబాద్ పట్టణం లో ఉన్న కోచింగ్ సెంటర్ లకు ధీటుగా మన కోచింగ్ సెంటర్ల ఏర్పాటు

  • ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్
  • చెన్నూర్ లోని పాత వ్యవసాయ మార్కెట్ , మందమర్రి పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర ఆలయం సమీపంలో CISF బ్యారక్ లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన విప్ సుమన్ ,శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ. సంకశాల మల్లేశం

మహా వెలుగు ,చెన్నూర్ : హైదరాబాద్ పట్టణం లో ఉన్న కోచింగ్ సెంటర్ లకు ధీటుగా కోచింగ్ సెంటర్లను ‘ బాల్క ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్థిక స్తోమత లేని వాళ్లకు, ఆడపిల్లలను సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివించుకోలేని పరిస్థితుల్లో బాల్క ఫౌండేషన్ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. రెండు కోచింగ్ సెంటర్ లలో కలిపి 2300 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారు తెలిపారు, అర్హులైన ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉచిత కోచింగ్ సెంటర్ లో విద్యాభ్యాసం చేయవచ్చని వారు తెలిపారు.

పాల్గొన్న విద్యార్థులు నిరుద్యోగులు

ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థుల కష్టం తెలిసిన వాడిగా.. ఎవరు పోటీ పరీక్షలకు దూరం కాకూడదని ఒక సంవత్సరం పాటు చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తామని ఉచిత కోచింగ్ తో పాటు, మధ్యాహ్న భోజనం, స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్ బాల్క ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

మాట్లాడుతున్న బాల్క సుమన్

పోలీస్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకునే వారికి ప్రత్యేకంగా పాలు, గుడ్లు వంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తామని
దూర ప్రాంత విద్యార్థులకోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని , క్రమశిక్షణ కలిగిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఈ బాధ్యతలను పోలీసు శాఖ వారికి అప్ప చెప్పినట్లు విప్ తెలిపారు.

అన్నం విలువ తెలిసిన వాడిగా కోచింగ్ కు వచ్చే ఎవరూ ఆకలితో అలమటించ కూడదనే సంవత్సరకాలం పాటు రెండు కూరలతో నాణ్యమైన భోజనం పెడుతున్నమని , సుమారు 20 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించిన కోచింగ్ సెంటర్ లను తీర్చిదిద్దిన పోలీసుశాఖను అభినందించారు. యువతులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ఆకతాయిల వేధించినా పోలీస్ శాఖ వారిని సంప్రదించవచ్చని వారి నెంబర్లు ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్టంలోని, విశ్వ విద్యాలయాల్లోని వివిధ అంశాల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రత్యేక భోదనా తరగతులు నిర్వహిస్తాం. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు. రేపటి మీ భవిష్యత్తుకు పెట్టుబడి.

చెన్నూర్ లో మెటీరియల్ అందజేస్తున్న విప్ సుమన్

పట్టుదల వదలకుండా చేసే మీ ప్రయత్నమే.. రేపటి మీ భవిష్యత్తును నిలబెడుతుందని
మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండని. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారని మీ శక్తిని కూడబెట్టి శక్తిమంతులు అవుతారా..? బలహీనులుగా మిగిలిపోతారా మీరే నిర్ణయించుకోండని మట్టిలో నుంచి మాణిక్యాలు పుడతారు అంటారు. అలాంటి మట్టిని చీల్చుకొని పుట్టే బొగ్గు నేలపై కూడా మాణిక్యాలు పుట్టాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టు “ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు” కాబట్టి మీరు ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ప్రయాణించండని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఉద్యోగం రాని వారు ఎవరూ నిరాశ చెందకూడదు. వైఫల్యం ఎప్పుడూ నిరాశకు కారణం కాకూడదు. మీలో కొత్త ప్రేరణకు పునాది కావాలని మీలో ఉన్న భయంతో ఏ పని చేసినా విజయాన్ని సాధించలేరు కాబట్టి భయాన్ని వీడి ఒక ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను తప్పక పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీ గమ్యం చేరేవరకు ఇంటర్నెట్, సినిమాలు.. ఇలాంటి విషయాలు పక్కనపెట్టి లక్ష్యంతో ముందుకు కొనసాగండని తెలిపారు.

పాల్గొన్న నిరుద్యోగులు

ఈ కార్యక్రమాలలో పాల్గున్న
రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి , ACP ఎడ్ల మహేష్ , మున్సిపల్ కమిషనర్ రాజు , సింగరేణి GM, చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్, కావున రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీ యువకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గున్నారు.