- రాత్రి ఒకరి ఇంటి ఆవరణలోకి చొరబడిన దొంగ
- ఇంటి యజమాని అరవగా పారిపోయిన దొంగ
మహా వెలుగు ,భీమారo 04 : మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రంలో దొంగల భీభత్సం సృష్టిస్తున్నారు. గత మూడు నెలల పరిధిలో రెండు మూడు చోట్ల దొంగలు పడి బంగారం దొంగలించగా మంగళవారం రాత్రి 11 గంటలకు గుడిమల్ల పొశం – రాజు ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు.
భీమారo మండల కేంద్రం లోని స్థానిక పద్మశాలి కాలనీకి చెందిన గుడిమల్ల పొశం – రాజు ల ఇంటి లోకి రాత్రి 11 గంటలకు చొర బడగా వాళ్ళు అప్పటికి మేల్కోవా తోనే ఉన్నారు. ఇంటి ఆరుబయట కు దోంగ రాగానే యజమానులు అరువగా దొంగ పారిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు అందరూ వచ్చే లోపే దొంగ పారిపోయినట్లు ఇంటి యజమానులు తెలిపారు. స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగ బ్లాక్ టిషర్ట్ ,షార్ట్ వేసుకున్నట్లు వారు తెలుపుతున్నారు.
3 నెలల్లో 3 చోట్ల దొంగతనం
గడిచిన మూడు నెలల్లో 2 చోట్ల దొంగలు బంగారం తో పాటు , డబ్బును దొంగలించగా మంగళవారం రాత్రి మాత్రం దొంగతనo కు యత్నించారు.