అకాల వర్షం రైతన్నలకు నష్టం ..

మహా వెలుగు ,మంచిర్యాల : రాష్ట్ర వ్యాప్తంగా కిరిసిన అకాల వర్షాలతో రైతుల కు అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం తో పాటు ,మామిడికాయ రైతులకు తీవ్ర నష్టం చేసింది. లక్షట్పెట్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం తడిసి ముద్దయింది.

వర్షం తడిచిన ధాన్యం

మంచిర్యాల ,చెన్నూర్ ,కడెం ,నిర్మల్ , కడెం , జన్నారం ,మండలాల్లో రాత్రి బీభత్సం సృష్టించిoది. మంచిర్యాల జిల్లా రైతులు పెద్డ ఎత్తున మామిడి సాగు చేస్తున్నారు. భారీ గాలుల తో మామిడి ఖాత రాలింది.

వరి ధాన్యం కాంట మొదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కళ్లలో గన్ని బ్యాగులు ,కాంటలు ఏర్పాటు చేయలేదని దాని వల్ల తీవ్రo గా నష్ట పోతున్నామని రైతులు వాపోతున్నారు.

మంచిర్యాల జిల్లా లో నెల రాలిన వరి పంట

మంచిర్యాల జిల్లా లో మామిడి రైతులకు అరి గోస

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు అకాల వర్షం చుక్కలు చూపెడుతున్నాయి. నెన్నెల్ ,భీమారo , అవుడం ,తాండూరు చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి. దీంతో అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ధర్మారంలో రాలిన మామిడి