మహావెలుగు కురవి/మే6 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బంగ్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి సత్యవతి రాథోడ్ క్షేమంగా బయట పడ్డారని ఎలాంటి ఆపదలు రాకుండా మంత్రి సత్యవతి రాథోడ్ కి కురవి వీరభద్ర స్వామి భద్రకాళీ అమ్మవారు ఆలయం లో తెరాస నాయకులు బాధే నాగయ్య సర్పంచ్ బొడ శ్రీను నాయక్ వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యవతి రాథోడ్ ఆయురారోగ్యాలతో కలకాలం సల్లంగా ఉండాలని కోరారు.
