అమ్మలకు ఆఫర్ పెట్టిన టీఎస్ ఆర్టీసీ

  • మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

హైదరాబాద్ మహా వెలుగు : మే 8 న మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా.. త‌ల్లుల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.
5 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌స్సున్న పిల్ల‌ల‌తో వ‌స్తే.. ఏసీ బ‌స్సుల‌తో స‌హా అన్ని ర‌కాల బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే ఈ ఆఫ‌ర్ ఒక్క మ‌ద‌ర్స్‌డే రోజు మాత్ర‌మేన‌ని ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది.

ఈ సంద‌ర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి, ఆ సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ మాతృ మూర్తులంద‌రికీ మాతృ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌దర్స్ డే అనే రోజు చాలా గొప్ప రోజ‌ని, మ‌నంద‌ర్నీ ఈ భూమి మీద‌కు తెచ్చిన త‌ల్లుల‌ను ఎంతో గౌర‌వించాల‌ని పేర్కొన్నారు.