మహా వెలుగు, భీమారo 07 : గొల్ల వాగుకు పోయేది ఎట్లా అని స్థానికులతో పాటు పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా గొల్లవాగు కు పోయే దారిలో నీళ్లు నిలవడం తోపాటు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని స్థానికులు పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళనకు గురవుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు కనీసం దారి కూడా లేదని ప్రజలు పర్యాటకులు తెలుపుతున్నారు.

అక్కడ నీరు నిలవడంతో ద్విచక్రవాహనాలు , కార్లు ,ఆటోలు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని కిలోమీటర్ వరకు నడిస్తే కానీ సందర్శించలేని పరిస్థితి నెలకొందని ప్రజలు తెలుపుతున్నారు. గొల్లవాగు చుట్టుపక్కల పొలాల తోపాటు మామిడి చెట్లు ఉన్నాయి. రైతులకు సైతం ఇబ్బందిని కలుగజేస్తుందని రైతులు వాపోతున్నారు.

