నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

  • వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
    మహబూబాబాద్.9.
  • మహబూబాబాద్ లోని ఆర్టీసీ బస్ డిపో ను పరిశీలించి , రామగుండాల..ఇల్లందు నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు .. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , జిల్లా కలెక్టర్ శశాంక,జెడ్పి చైర్ పర్సన్ బింధు , ఎమ్మెల్యే శంకర్ నాయక్.
  • ఈ సందర్భంగా మంత్రి బస్ డిపో సమస్యలను ,డిపో లాభాల్లో నడిచేందుకు తీసుకోవలసిన చర్యలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ చైర్మన్ , ఎం.డి ల తో ఫోన్ లో మాట్లాడి మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోను ఎత్తివేస్తారని మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయనీ, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారనీ మహబూబాబాద్ డి విజన్ గా ఉన్నప్పుడే డిపోను తెచ్చుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆర్టీసీ పై ఉన్న ప్రేమతో నష్టాల్లో కూరుకుపోయినా ట్రెజరీ నుండి జీతాలను ఇచ్చి సంస్థ ను కాపాడుతునారన్నారు.
లాభాల్లో నడిచేందుకు సిబ్బంది కృషి చేయాలినీ తెలిపారు.
శాతవాహన కన్నా ముందు మహబూబాబాద్ నుండి హైదరాబాద్ కు ఏ.సి బస్సు ను నడపాలని అధికారులను కోరారు.ప్రజలకు మెరుగైన ,సురక్షితమైన రవాణా కల్పించడానికి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుకునే విధంగా సంస్థను బలోపేతం చేస్తామనీ మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ శ్రీనివాస్ నాయక్ , మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ ,ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.