వైకుంఠధామాలకు నీటి కరువు

  • లక్షలు వెచ్చించిన ఫలితం శూన్యం
  • సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం.
  • ఆర్భాటాలే తప్ప ప్రజా అవసరాలకు పనికి రావడం లేదు.
    వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్.9.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామా లలో కనీస సౌకర్యాలు కల్పించకపోగా మరణించిన వ్యక్తికి దహన క్రియలు చేయడానికి అవసరమైన నీటి వనరులను కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది.
    మహబూబాబాద్ జిల్లా కు చీర లో ఉన్న బయ్యారం మండలం మహా దేవుళ్ళ గుల్ల వద్ద నిర్మించిన వైకుంఠ దామానికి సరిహద్దు గోడ నీటి సౌకర్యాలు కనీసం వనరులు కల్పించలేకపోయారు.
    ఇలా ప్రతి గ్రామంలో నిర్మించిన వైకుంఠదామల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రజాధనంతో నిర్మించిన ఈ సౌకర్యం ప్రజాకంఠగా నిర్వీర్యం స్థితిలో ఉంది.
    వ్యక్తి చనిపోతే కనీసం దహన క్రియలు చేసుకుంటానికి చోటు లేకపోయింది అంటూ ఆర్బాటంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో వైకుంఠదానాలు ఆర్బాటంగా ప్రకటనలు చేసి గుత్తేదారులకు నిర్మాణ అనుమతులు ఇచ్చి తర్వాత పట్టించుకోలేదని ఆయా గ్రామ ప్రజలు ఎన్నో సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఫలితం లేకపోయింది. ప్రజాధనం నిర్వీర్యమై పోయింది.
    ప్రజాదరణ పొందాలని ఆర్భాటమే తప్ప ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? లేదా?అన్నది పాలకులు ప్రభుత్వ అధికారులకు పట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సదరు గుత్తేదారులు నిర్మించిన నిర్మాణాలను పరిశీలించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిరుపయోగంగా బోర్ వ్యవస్థ.

జిల్లాలో కొన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించిన తర్వాత భూగర్భ జల అన్వేషణ శాఖ ఆధ్వర్యంలో బోర్ పాయింట్ వేయగా అధికారుల నిర్లక్ష్యం తో పాయింట్ వేసిన ప్రదేశంలో కాకుండా తనకు నచ్చిన చోట బోరు నిర్మిస్తే ఆ బోర్లలో నీళ్లు లేక వైకుంఠదామాలకు వచ్చిన మృత కుటుంబాలు నీళ్లు దొరకక వెయ్య ప్రయాసపడి ఎక్కడో దూరంగా ఉన్న వ్యవసాయం బావలకు వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వయో వృద్ధులు చిన్న వయసు గలవారు ఈత రాక మృత్యువాత పడిన సందర్భాలు జిల్లాలో అనేక సందర్భాలలో చూస్తున్న పాలనా యంత్రాంగం మాత్రం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

వైకుంఠ దామాల నిర్మాణాలలో ప్రజాధనం అనేక కోట్లు దోపిడీకి గురైందని వెంటనే ఇప్పటికైనా సంబంధిత శాఖలపై సిబిఐ ద్వారా విచారణ జరిపించి సదరు వ్యక్తుల పై చట్టపరమైన శిక్షలు విధించాలని, దోచుకున్న ధనాన్ని నిర్మితమైన వైకుంఠ దామాలకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలకులను కోరారు.