తమ్ముని మృతి ని తట్టుకోలేక అన్న గుండె పోటు తో మృతి

మహా వెలుగు మంచిర్యాల 09 : లక్సట్టిపేట పట్టణానికి చెందిన గాజులు భాస్కర్ గౌడ్ ( 47 ) గుండె పోటుతో ధర్మపురిలో మృతి చెందాడు. తన తమ్ముడు భాస్కర్ గౌడ్ మృతి చెందాడని తెలుసుకొని జగిత్యాలలో ఉంటున్న మృతుని అన్న శ్రీనివాస్ గౌడ్ లక్సట్టిపేట కు వచ్చి తమ్ముడు భాస్కర్ గౌడ్ మృత దేహం చూసి ఒక్క సారి కుప్ప కూలి పోయాడు.

వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గుండెపోటు తో మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఒకే ఇంటిలో ఇద్దరు అన్న దమ్ములు గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తమ్ముని మృతి ని తట్టుకోలేక పోయిన అన్న కూడా మృతి చెందడం బాధాకరం దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.