భీమారం లో మామిడి దొంగలు

– తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లై నుండి రేషన్ షాప్ కు  ఇచ్చే గన్ని బ్యాగ్ లో మామిడికాయలు తరలించేందుకు ప్రయత్నం..
– మామిడి తోట యజమాని చూసి పరిగెత్తిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు

మహా వెలుగు మంచిర్యాల 09 ; మంచిర్యాల జిల్లా భీమారo లో మామిడికాయలు దొంగతనం చేసిన సంఘటన కలకలం రేపుతుంది. సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది… యజమాని మనోహర్ రెడ్డి  తెలిపిన వివరాలతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.

సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్న మెసేజ్

””8.5.2022 రోజున మంతమ్మ కి ఎదురుగా ఉన్న మా తోటలో మామిడి కాయల దొంగతనం చేయడానికి వచ్చి వీలుకాక వారి చెప్పులు మరియు 2 సంచులు వదిలిపెట్టి వెళ్ళినారు.. ఆ చెప్పులను పరిశీలిస్తే వాళ్ళు  సమాజం లో గొప్పవారు లాగానే కనపడుతున్నారు. మరియు ఆ సంచులు ration shop కి సంబంధించినవి.. అంటే దీనిని బట్టి ఈ దొంగలు  సమాజం లో గొప్పవారు లాగానే ఉండేవాళ్ళు.. కాబట్టీ ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని సోషల్ మీడియాలో చెప్పుల  ఫోటోలతో పాటు మామిడి కాయలు సంచిలో నింపిన ఫోటోలతో పాటు తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లై తరఫున పంపిణీ చేస్తున్న బియ్యం గన్నీ బ్యాగులను ఫోటోలు తీసి పెట్టారు. దీంతో మండల వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.

మామిడికాయలు దొంగతనానికి వచ్చి దొంగ వదిలేసిన చెప్పులు

సివిల్ సప్లై నుండి వచ్చే గన్ని బ్యాగులు తోటకు ఎలా పోయాయి

తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తున్న రేషన్ బియ్యం పథకం లో భాగంగా సివిల్ సప్లై నుండి గన్ని బ్యాగుల ద్వారా రేషన్ షాపులకు రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం నెలకు నెలకు అందిస్తున్నది. కానీ రేషన్ షాప్ లో ఉండే గన్ని బ్యాగులు మామిడి తోటలో దర్శనమిచ్చాయి.  దీంతో ప్రజలు స్థానికులు అవాక్కవుతున్నారు. కాగా తోటలో ఆరు క్వీoటల్ల మామిడి కాయలు చోరీ అయినట్లు యజమాని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల మంజూరు చేస్తున్న రేషన్ బియ్యం పాలక గన్ని బ్యాగులు