గోదావరిఖని యువకుడికి కలెక్టర్ అభినందన

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 10 :పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన భగత్ ప్రశాంత్ ను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అభినందించారు.

ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా భగత్
ప్రశాంత్ రూపొందించిన ‘ఎమర్జెన్సీ బైక్ పిస్టన్ ఎయిర్ డివైస్’ నమూనా ఎక్స్ క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు పాలనాధికారి కుమార్ దీపక్, సైన్స్ అధికారి రవినందన్ రావు తదితరులు అభినందించారు.