మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 10 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లాలో నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్మడానికి జగిత్యాల నుండి తీసుకోని వచ్చి అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది ప్రకాష్ , మల్లేష్ తో కలిసి కుక్కల గూడూరు గ్రామం శివారులో , తుమ్మల కుమార్ అనునతని కార్ అపి తనిఖీ నిర్వహించగా రూ: 8000 వేల రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు V1 జర్థ ఉత్పత్తులు లభించాయి.
ఇట్టి నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఎక్కడి నుండి ఎక్కడికి ఎవరికి సరఫరా చేస్తున్న అని విచారించగ జగిత్యాల నుండి V1 జర్థ ను అబిషేక్ , అంతర్గం అనునతాను తీసుకు రమ్మని చెప్పగా ఇట్టి నిషేధిత పొగాకు ఉత్పత్తులు తీసుకొస్తున్ననని తెలపడం జరిగింది. కార్ నెంబర్ TS22C 1636 ను, పొగాకు ఉత్పత్తి లు స్వాధీనం చేసుకొని తుమ్మల కుమార్ s/o శంకర్,29yrs, SC, R/o, 3-29, అంతర్గం ని అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
