- ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు
- ఎన్నికలలో రెడ్యా నాయక్ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి
మహావెలుగు కురవి/మే10 రిపోర్టర్ చల్ల వేణు : కురవి మండల కేంద్రములోని జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మండల కేంద్రము ఏర్పాడి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటి దాకా జూనియర్ కాలేజీ మంజూరు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.అలాగే మండలంలో దాదాపు 2000 మంది విద్యార్థులు పై చదువుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది అన్నారు.పేధ విద్యార్థులు జిల్లా కేంద్రానికి వేళ్లలేక ,చదువును మధ్యలోనే ఆగిపోయింది అన్నారు. మండలంలోని పేద విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా అవుతుంది అన్నారు.తక్షణమే జూనియర్ కాలేజీని ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుంటాం,అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షుడు వీరెందర్ ,డివిజన్ మండల నాయకులు నవీన్ ,సాయి ,భరత్,సాయి కుమార్,కళ్యాణ్,అనిల్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
