భీమారo లో గంజాయి అమ్మకాలు జోరు

పాత చిత్రం

మహా వెలుగు ,మంచిర్యాల ,( భీమారo ) 11 : భీమారo లో గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. భీమారo మండల వ్యాప్తంగా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భీమారo మండల కేంద్రానికి చెందిన కొoత మంది యువకులు గంజాయిని తెచ్చి రిక్కల మాదిరిగా చేసి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బూర్గుపల్లి గ్రామానికి చెందిన యువకులు చెన్నూర్ , మంచిర్యాల పట్టణాల నుండి వారి బంధువుల దగ్గర తెచ్చి ఇక్కడ యువకులకు అందిస్తున్నారు. 

మహా రాష్ట్ర ,మంచిర్యాల,చెన్నూర్  నుండి భీమారoకు దిగుమతి

భీమారo మండల వ్యాప్తంగా పదుల సంఖ్యలో యువకులు తెచ్చికుని వాడుతున్నట్లు సమాచారం భీమారo మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు , తాళ్లగూడెం గ్రామానికి చెందిన మరో యువకుడు , కొత్తగూడిసేలు కాలానికి చెందిన యువకుడు , బూర్గుపల్లి గ్రామానికి చెందిన యువకులు మరి కొంతమందితో కలిసి ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నట్టుకు సమాచారం …

ఎంత కావాలంటే అంత ఆర్డర్ పై మీ ఇంటికే …

యువత ఎంత కావాలంటే అంత ఆర్డర్ పై ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నట్లు సమాచారం.. దానిని ఇక్కడ యువత మళ్ళీ అధిక ధరలకు సైతం అమ్ముతున్నారని కొంత మంది యువత బహిరంగనే చెప్తున్నారు.

పాత చిత్రం

భీమారo మండల కేంద్రం తో పాటు గా , రెడ్డిపల్లి ధర్మారం గ్రామ పంచాయతీ కి చెందిన యువత , బూర్గుపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ యువకులు , భీమారo మండల కేంద్రంలో ఉన్న ఇంటర్ ,డిగ్రీ , జులై గా తిరిగే యువత దగ్గర ఈ గంజాయి లభిస్తుందని సమాచారం.

యువత వాడే విధానం

గంజాయి అలవాటు అయిన యువత ఆయా దుకాణాల్లో చిన్న గోల్డ్ ఫ్లాక్ , టోటల్  ,చిన్న సిగరెట్లలో పొడిని నింపి పిలుస్తున్నట్లు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా చాప కింద నీరులా ఒక్కో గ్రామానికి గంజాయి పాకుతుంది. మరి కొంత మంది యువత స్థానిక అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడే గంజాయి తాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం…