అంతర్ జిల్లా మోటార్ సైకిళ్ళ ( బైక్ ల ) దొంగలు అరెస్ట్

  • జల్సాల కోసం చోరీలు … నిర్జన ప్రదేశాలలో పార్కింగ్ చేసిన మోటర్ సైకిల్లే టార్గెట్…
  • ముగ్గురు నిందితుల అరెస్ట్…..15 బైక్ ల స్వాధీనం

మహా వెలుగు పెద్దపల్లి ; ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుండి 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి డిసిపి రవీందర్ , గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్ ,అధికారులతో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేసి బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డి సి పి

వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల రోజుల నుండి NTPC పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ లు చోరికి గురి అవుతుండడం తో ,ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు మేడిపల్లి చౌరస్తా లో, NTPC పోలీసులు వాహనాల తనిఖి నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు మోటార్ సైకిల్స్ పై వస్తూ పోలీస్ వారిని చూసి అనుమానాస్పదంగా పారిపోతుండగా చాకచక్యంగా వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు అరునియ రవి, M. రవి లు అని, వాహన పేపర్లు అడగగా అట్టి వాహనాలను దొంగిలించినట్లుగా తెలపడం జరిగిందని , వెంటనే వారిని అదుపులో కి తీసుకోని విచారించగ దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన వాహనాలను నిందితుడు/రిసివర్ బయ్యపు దామోదర్ రెడ్డి మంచిర్యాల జిల్లా ( భీమారo మండల కేంద్రం లో టి కింగ్ హోటల్ యజమాని ) ద్వారా అమ్మి వచ్చిన డబ్బుల తో జల్సాలకు పాల్పడుతున్నట్లు విచారణ లో వెల్లడైనది అని పెద్దపల్లి డిసిపి రవీందర్ వెల్లడించారు.

1). అరునియ రవి సుభాష్ నగర్, NTPC .
2). M. రవి R /o NTPC .
౩) బయ్యపు దామోదర్ రెడ్డి రాణాపూర్ , పాలకుర్తి మండలం .

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు..

13 కేసులలో చోరికి పాల్పడిన 15 మోటార్ సైకిల్ల ను వారి వద్ద నుండి స్వాదీనపరచుకున్నట్లు వారు తెలిపారు.

పట్టుబడిన వాహనాలు

నిందితులు నేరం చేయు పద్ధతి గురించి వివరించారు.
నిందితులు అరునియ రవి, M. రవి లు NTPC లో సాదారణ కూలీ లు గా పని చేస్తూ, వచ్చే జీతం వారి జల్సాలకు సరిపోక ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో, మోటార్ సైకిళ్ళు దొంగిలిచి ఎవరికైనా అమ్మితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని నిశ్చయించుకుని ఏన్టీపీసీ గోదావరిఖని, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, నస్పూర్ నిర్జన ప్రదేశాలలో పార్కింగ్ చేసి వున్నా బైక్ లను అపహరించి ,తమ స్నేహితుడైన బయ్యపు దామోదర్ రెడ్డి ద్వారా అమ్ముకొని తద్వారా వచ్చే డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్నారు.

నిందితుల పై పోలీస్ స్టేషన్ లవారిగా నమోదు ఐనా నేరాల వివరాలు..

ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ లో -04 కేసులు , మందమర్రి పోలీస్ స్టేషన్ లో -01 కేసులు , రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో -02 కేసులు , శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో -01 కేసులు , గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో -01 కేసు , తాళ్ళ గురిజాల పోలీస్ స్టేషన్ లో -01 కేసు, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో -01 కేసు, కాసిపేట పోలీస్ స్టేషన్ లో -01 కేసు , బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో -01 కేసు

కే.లక్ష్మి నారాయణ , సి ఐ, రామగుండము ఆధ్వర్యంలో…నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన N. స్వరూప్ రాజ్, ఎస్సై ఆఫ్ పోలీస్,ఏన్టీపీసీ, K. కుమార్, SI –II, సిబ్బంది N. మల్లిఖార్జున్, పి . అజయ్,T. అంజయ్య, లను పెద్దపల్లి డి సి పి శ్రీ పి. రవీందర్ రివార్డులు ఇచ్చి అభినందించారు.