వర్షం తో చల్లబడిన వాతావరణం

మహా వెలుగు మంచిర్యాల 11 : బుధవారం సాయంత్రం కురుస్తున్న వర్షానికి వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఎండలు కొడుతుండటం తో పాటు తీవ్ర మైన వడగాలులు వీస్తుండడంతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

సాయంత్రం సమయంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర గడుపు దుమారం రాగ ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం చల్లబడింది. కాగా మామిడి రైతుల తో పాటు పాడి రైతులకు ఈ వర్షం తీవ్ర దుఃఖాన్నీ మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా రైతులు పండిoచిన పంట చేతికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. తమకు సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.