భీమారoలో మద్యం త్రాగి యువకుల కార్ హల్చల్

నుజ్జు నుజ్జు అయిన కారు

మహా వెలుగు ,భీమారo 11 : మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రం లో కార్ హల్చల్ చేసింది. మంచిర్యాల జిల్లా సిసి కార్నర్ కు చెందిన ప్రవీణ్ , రాజ్ కుమార్ లు మద్యం మత్తులో భీమారo కు వచ్చి రాత్రి సమయంలో రావి చెట్టు కాలనీతో పాటు ,పద్మశాలి కాలనీ లో కార్ తో వీరంగం సృష్టించారు.

మద్యం మత్తులో ఉన్న యువకుడు

కాలేజ్ యువతులకు డ్యాష్ ఇచ్చి వెళ్లారు. వారిని డీ కొట్టే వారు. స్థానిక బైక్ గ్యారేజ్ వద్ద ఒక్కసారిగా కార్ బోల్తా కొట్టింది.

నుజ్జు నుజ్జు అయిన వెనుక భాగం

కారు లో ఉన్న రాజ్ కుమార్ తో పాటు ప్రవీణ్ లు ఉండగా ప్రవీణ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మట్టి కుప్పలు ఎక్కిన కారు ఎగిరి పడింది. దీనితో కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడం తో పెను ప్రమాదం తప్పింది. రాజ్ కుమార్ కు తలకు తీవ్ర గాయం అయింది. కాగ టిఎస్ 19 ఈ 0007 గల కార్ నుజ్జు నుజ్జు అయింది.

వెనుకాల డ్యామేజ్ అయిన కార్