- ఎస్ఎఫ్ఐ మానుకోట డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్
మహావెలుగు మహబూబాబాద్/మే 16 : మహబూబాబాద్ జిల్లా, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు హాల్ టికెట్ పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు అని
మానుకోట పట్టణ కేంద్రం లో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఎస్ ఎఫ్ ఐ మానుకోట డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ అన్నారు.
ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఫీజుల పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా, కొన్ని బడా ప్రైవేట్ పాఠశాలలు మొత్తం ఫీజులు కడితెనే హాల్ టికెట్ ఇస్తం, లేకపోతే మీరు పాస్ అవ్వలేరు అని విద్యార్థులను భయ భ్రాంతులకు గురి చేస్తున్న పాఠశాలల పై ,మరియు అధిక పిజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై జిల్లా ఉన్నత విద్య అధికారులు చొరవ తీసుకొని కార్పొరేట్ పాఠశాలల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పిజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.ఎస్సీ ఎస్టీ వెనుకబడిన విద్యార్థులకు ప్రతి ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించని పాఠశాలల పై,విద్య హక్కు చట్టాన్ని అమలు చేయని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రలో పదో తరగతి ప్రశ్నపత్రం పేపర్ లీకేజీ కారణమైన నారాయణ ,శ్రీచైతన్య, పాఠశాలల తెలంగాణలో, శ్రీ చైతన్య నారాయణ కార్పొరేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పట్టణ నాయకులు రాజేష్, సందీప్, జోగేంద్ర,రాకేష్,చరణ్,రఘు,నవీన్,రంజిత్,వేణు, తదితరులు పాల్గొన్నారు.
