అమరుల ఆశయ సాధనకై ఉద్యమిద్దాం

  • నాయకులు బానోత్ దేవేందర్

మహావెలుగు కురవి/ మే16 రిపోర్టర్ చల్ల వేణు : విప్లవొద్యమంలో పేదల కోసం అసువులు బాసిన కామ్రేడ్ వీరన్న 23వ, వర్ధంతి , బోగా శ్రీరాములు 7వ,వర్ధంతి కార్యక్రమం ను కురవి మండల కేంద్రంలో సిపిఐ (యం యల్ )న్యూడెమోక్రసీ అధ్యర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. నక్సల్బరీ లో ఉద్భవించిన పోరాట బాటలో ఎంతోమంది అమరులు తమ వేడి నెత్తురు చిందించిన త్యాగాల బాటలో కామ్రేడ్ మారోజు వీరన్న, బోగా శ్రీరాములు (మాధవన్న )లు పోరు బాటలో పయనించారు.

ఈ క్రమంలో రాజ్యo విప్లవకారుల పై నిర్బంధం ప్రయోగించి వారిని హతమార్చాలని కుట్ర పన్నింది. కామ్రేడ్ వీరన్నను హైదరాబాద్ లో నిరాయుడుడైనా ను పట్టుకుని కరీంనగర్ లో హత్య చేసి ఎన్ కౌంటర్ కధలు అల్లినారు, కామ్రేడ్ మాధవన్న అనారోగ్యం తో మరణించారు.
వారు ఎన్నో ఉన్నంత చదువులు చదివి పెదప్రజలకోసం విప్లవోద్యమంలో పయనించారు. అలాంటి మహానీయుల బాటలో పయణించి వారి ఆశయసిద్ధికోసం పోరాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమా, వీరభద్ర, పంద్మ, యాకమ్మ, గుజ్జుల ముత్తయ్య, అనిల్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.