ఢిల్లీకి నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరే ఆలోచన….?

మహా వెలుగు, మంచిర్యాల 19 : తెలంగాణ ఉద్యమ కారుడు , చెన్నూరు లో టీఆర్ఎస్ పార్టీ ని మోసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గత కొన్ని రోజులుగా సన్నిహితులు , పార్టీ నాయకులు , అభిమానులు , కుటుంబ సభ్యులు , గత క్యాడర్ తో ముమ్మరంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కు చెందిన కీలక నాయకుడు , హైదరాబాద్ కు చెందిన ముఖ్య నాయకుడు తో కలిసి ఢిల్లీ కి వెళ్లినట్లు సమాచారం , ఆయన వెంట మంచిర్యాల జడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మీ తో పాటు కుటుంబ సభ్యులు ,మరో ప్రజా ప్రతినిధీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ రెండు రోజుల్లో ఢిల్లీ లో పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్టుకు తమ దగ్గరున్న క్యాడర్ తెలుపుతుంది.

చెన్నూర్ నియోజకవర్గ వర్గం లో ఓదెలు క్యాడర్ కాళీ

కాగ నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతే చెన్నూరు నియోజకవర్గo లో ఉన్న
ఓదెలు క్యాడర్ కాళీ అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతం లో ఓదెలు తో పని చేసిన నాయకులు , అభిమానులు ఓదెలు వైపు కు మొగ్గు చూపేందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా నల్లాల ఓదెలు సైతం చెన్నూర్ నియోజకవర్గoలో యాక్టివ్ కనిపిస్తున్నారు. ఉద్యమ కారుడు ,తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్న భీమారo మండలానికి చెందిన తెలంగాణ సంస్కృతిక కళాకారుడు చింతo రాజమల్లు గత కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వారి కుటుంబానికి రూ. 50 వేలు అందజేసి అండగా నిలిచారు. ఉద్యమ కారుడు కావడం తో ఓదెలు వచ్చి అండగా నిలవడం తో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నిజమైన అభిమానులు , ఉద్యమ కారులు , ఓదెలు వర్గం లో మండలానికి వందల సంఖ్యలో ఉండటం గమనార్హం.