వారసుల ఉద్యోగాలకు సింగరేణి గ్రీన్ సిగ్నల్


మహా వెలుగు న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పెద్దపల్లి జిల్లా చంద్ర కాంత్ 19 :
సింగరేణిలో పెండింగ్లో ఉన్న వారసులకు ఉద్యోగాలకు సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014 జూన్ 1 నుంచి 2022 ఏప్రిల్ 19 వరకు పెండింగ్లో ఉన్నవారికి ఉద్యోగాలిస్తామని ఉత్తర్వులిచ్చింది. ఇటీవల
RLC సమక్షంలో జరిగిన చర్చల్లో సంస్థ వన్లైం సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలిస్తామని అంగీకరించింది. మెడికల్ బోర్డు నిర్వహించడంలో జాప్యంతో వయోపరిమితి 35 ఏళ్లు దాటడంతో ఉద్యోగం దక్కని వారికి అవకాశం కల్పించింది.