కాంగ్రెస్ నేత రంగన్నకు డాక్టర్ రామచంద్రనాయక్ భరోసా

మహావెలుగు కురవి రిపోర్టర్ చల్ల వేణు మే 18 : మహబూబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామస్తులు రంగన్న గౌడ్ తన ద్విచక్రవాహనంపై ఇటీవల ప్రమాదవశాత్తు క్రింద పడగా తలకు బలమైన గాయాలు తగలడంతో హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రామచంద్రనాయక్ వైద్యులను ఎప్పటికప్పుడు రంగన్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ ఈరోజు స్వయంగా తన వెళ్లి ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని కోలుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని వారన్నారు.

వారి కుటుంబ సభ్యులు ఆ ధైర్య పడకూడదని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎల్లవేళలా నా సహకారం ఉంటుందని కంటికి రెప్పలా కాపాడుకుంటామని నా సొంతం అన్న తో సమానం రంగన్న వారి కుటుంబ సభ్యులకు చెప్పి ప్రత్యేకంగా వైద్య అధికారులతో మాట్లాడారు.

అవసరమైతే బెంగళూరు నుంచి కూడా వైద్యాధికారులను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రంగన్నను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.