వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 19 : గతంలో ప్రచురించిన ‘జిల్లా వ్యాప్తంగా వైకుంఠ దామలలో నీటి కరువు’అంశంపై జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలలో వైకుంఠ దామల వద్ద బోర్వెల్ లను ఆయా గ్రామ పంచాయతీలు తాత్కాలిక మరమ్మతులు చేశారు.
కొన్ని గ్రామాలలో నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.
బయ్యారం మండల కేంద్రంలో ఉన్నటువంటి వైకుంఠధామం వద్ద బోర్ వెల్‌కు బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ తాత్కాలిక మరమ్మతులు చేశారు.
అయినా కూడా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో వైకుంఠ ధామాల వద్ద నీటి తిప్పలు యథాతథ స్థితిలో కొనసాగుతున్నాయి. భూగర్భజల అన్వేషణ శాఖ ఇచ్చిన పాయింటింగ్ ప్రకారం బోర్వెల్ను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
