- వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్, మే -19:
ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆకస్మికంగా తనిఖీ
గురువారం జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీనిధి ఐ.కే.పి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, శనిగపురం లో పిఎసిఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా పర్వతగిరి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సెంటర్ ఇంచార్జీ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రం ఇన్చార్జిలు రిజిస్టర్ లో ఫార్మాట్ ప్రకారం క్రమపద్ధతిలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నమోదు చేయాలని, అలా కాకుండా కాగితాలపై వివరాలు నమోదు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎప్పుడు ధాన్యం తీసుక వచ్చారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతుకూ తాను ఏ రోజు ధాన్యం తీసుకొచ్చింది, 17 శాతం తేమ శాతం రావడానికి ఎన్ని రోజులు పట్టింది, కొనుగోలు వివరాలను నమోదు చేసి పారదర్శకత పాటించాలని, టార్పాలిన్ లు 25 ఉండడం తో కనీసం 30 ఉండాలని, ఇంకను అవసరం అవుతాయని వెంటనే తెప్పించాలని ఆదేశించారు. కాంటాలు, ప్యాడీ క్లీనర్ లు, విద్యుత్ సౌకర్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్యాడి క్లీనర్ లను వాడుతున్నారా లేక కూలీ లతో శుభ్రం చేయిస్తున్నార అని తెలుసుకున్నారు. గన్ని బ్యాగ్ ల కొరత లేకుండా చూసుకోవాలని, సరఫరా చేసిన రోజు వాటిని పరిశీలించాలని, వారం వారం రికన్సిల్లేషన్ చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమన్వయంతో రవాణా చేయించాలని, రిసిప్ట్ లు ఇవ్వాలని, ట్రక్ షీట్ వెంటనే అప్లోడ్ చేయాలని, అరైవల్ రిజిస్టర్ ను పరిశీలించి ధాన్యాన్ని ఎవరు ఎప్పుడు తీసుకు వచ్చారని, తేమ శాతాన్ని పరిశీలించారు. శిక్షణ ఇచ్చి ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై ఉపేక్షించేది లేదని, మండల స్థాయి సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు.
అనంతరం శనిగపురం గ్రామంలో పాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. శుభ్రపరిచి కొనుగోలు చేసి రసీదు జారీ చేసిన విధంగా కలెక్ట్ చేసిన శాంపిల్స్ ను ఉంచాలని, ఒక్క కిలో కూడా తరుగు లేకుండా రసీదు ప్రకారం చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రసీదు పైన, కొనుగోలు పత్రం పైన శుభ్ర పరిచినవి అని రాయాలని సూచించారు. వాటి ప్రకారం పూర్తిగా చెల్లింపులు అయ్యే విధంగా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం స్టాక్, ధాన్యం గిడ్డంగుల రవాణా రిజిస్టర్ లను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని, శుభ్రం చేసిన ధాన్యం తేవాలని, అలాంటప్పుడు ఒక్క కిలో కూడా తగ్గకుండా మొత్తం రసీదు ప్రకారం చెల్లింపులు చేయుటకు అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ మహేందర్, మహబూబాబాద్ తహశీల్దార్ నాగభవానీ, మండల వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి, ఏ. ఈ. ఓ. రాజ్యలక్ష్మి, శనిగ పురం పి ఎ సి ఎస్ ఇంచార్జీ, తదితరులు పాల్గొన్నారు.
