- గార్ల మండలం లో పుచ్చలపల్లి సుందరయ్య స్తూప ఆవిష్కరణ.
- సుందరయ్య వర్దంతి సభలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్.
వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ఇల్లందు 19.
మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం గార్ల బయ్యారం మండలాలలో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా గార్ల మండలంలో పుచ్చలపల్లి సుందరయ్య స్తూప ఆవిష్కరణ
సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
నిస్వార్థ రాజకీయ నాయకుడు ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పోరాట స్పూర్తిని భావితరాలు ఆదర్శంగా తీసుకొవాలని పిలుపునిచ్చారు.సంపన్న వర్గం లో పుట్టిన సుందరయ్య అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి తన జీవిత మొత్తాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించారని అన్నారు.
కమ్యూనిస్టు గాంధీ గా పిలవబడే సుందరయ్య ఉత్తమ పార్లమెంటేరియన్ గా నాడు ఎంపికై, సాధారణ జీవితాన్ని గడుపుతూ, సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్ళేవారని అన్నారు.అంటరాని తనం రూపు మాపుటకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను స్వయంగా తీసుక వచ్చి,తక్కువ ధరకు పేదలకు అమ్మారని అన్నారు.సాయుధ పోరాట రథసారథి గా లక్షల ఎకరాల భూములు పంచడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.సంతానం ఉంటే ప్రజా సేవకు ఆటంకమని తన సతీమణి లీలా సుందరయ్య తో కలిసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న ఆదర్శ దంపతులు అని కొనియాడారు.
సుందరయ్య లాంటి ఆదర్శ వంతులు ఉన్న ఈ దేశంలో నేడు బిజెపి పార్టీ కులం, మతం, ప్రాంతీయ భేదాలతో అలజడులు సృష్టించి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు, ఆసరా పింఛన్లు ఇస్తామని వాగ్దానం చేసిన సియం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు.ఆదర్శ నేతగా, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత గా ఉన్న సుందరయ్య జీవితాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సుందరయ్య ఆశయ సాధనకు ఆకలి, దోపిడీ, అసమానతలు లేని సమాజం కై నాయకులు,కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
బయ్యారం మండలంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం సుందరయ్య జీవిత చరిత్ర పార్టీ సభ్యులతో కలిసి మాటా-మంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ వర్ధంతి సభలో ఆయా మండలాల జిల్లా కమిటీ సభ్యులు, సెక్రటేరియట్ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, యువజన,విద్యార్థి సంఘ నాయకులు, పార్టీ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
