– – పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్
మహా వెలుగు ,మంచిర్యాల 20 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ఉచిత సామూహిక ఉపనయనాలు వైభవంగా నిర్వహించారు.. స్థానిక శివాలయంలో శుక్రవారం వేద పండితులు బ్రహ్మశ్రీ గట్డు నరహరి శర్మ అవధాని, పులి సీతారాం శర్మ ఆధ్వర్యంలో చెన్నూర్ బ్రాహ్మణ సేవా సంఘం సహకారంతో ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, మంథని, ధర్మపురితో పాటు వివిధ పట్డణాలు, జిల్లాల నుంచి 30 మంది వటువులు తరలి వచ్చి ఉపనయనం చేసుకున్నారు. ఈ క్రతువులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రుత్వికులు, వేద బ్రాహ్మణులు పాల్గొని శాస్త్రోక్తంగా చేశారు.
ఉదయం 4 గంటలకు ఉపనయన సంస్కార కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. ఉదయమ 8.49 నిముషాల కు సుముహూర్తంలో వటువులకు ఉపనయనం గావించారు. వటువులకు పలువురు మాతృ భిక్షలు అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సహకారం అందించిన పలువురిని బ్రాహ్మణ సేవా సంఘం తరపున సన్మానించారు.

ఈ కార్యక్రమానికి అప్పాల సత్యవర్ధన్ రఘు వర్ధన్, హరి వర్ధన్ దంపతులు ఆర్థిక సహకారం అందించగా, చెన్నూర్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ పురాణపు సతీష్ హాజరై వటువులకు భిక్ష అందించారు. కార్యక్రమం వివరాలు అడిగితెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వటువుల బంధువులు, మిత్రులు, ప్రజలు తరలివచ్చారు.
