మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 20 :
గోదావరిఖని: సీతానగర్ లో ACP గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాలు లేని 75 బైకులు, 7 ఆటోలను సీజ్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
