మహా వెలుగు నిజాంపేట, : వావీవరుసలు మరిచిన ఓ కళాశాల విద్యార్థి సొంత చెల్లెలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ బాలికను ఐదు నెలల గర్భవతిని చేశాడు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కేరళ నుంచి నగరానికి వలసొచ్చిన ఓ కుటుంబం బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటోంది. కుటుంబ యజమాని వ్యాపారం నిర్వహిస్తుండగా భార్య ఐటీ ఉద్యోగి. వీరి కుమారుడు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె(13) తొమ్మిదో తరగతి చదువుతోంది. వీరిద్దరు ఇంట్లో ఒకే గదిలో నిద్రించేవారు. ఈ నేపథ్యంలో చెల్లెలిని లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. తరువాత బాలికకు కడుపునొప్పి రావడంతో మాదాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు.
దాంతో బాలిక గర్భవతని తేలింది. బాలికకు అబార్షన్ చేయించడానికి ఈస్ట్మరేడ్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు విషయాన్ని మేడ్చల్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ)కు సమాచారం ఇచ్చారు. ఆ విభాగం అధికారులు ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు నిందితుడిపై ఐపీసీ376(2)సెక్షన్తో పాటు పోక్సో చట్టం కింద ఈ నెల 17న కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు
సీఐ కె.నర్సింహారెడ్డి తెలిపారు.
