సర్పంచ్ ,ఎంపిటిసిల ఉప ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి

మహా వెలుగు, మంచిర్యాల 21 : మంచిర్యాల జిల్లా లో కాళీ గా ఉన్న జడ్పిటిసి ,సర్పంచ్ లు , ఎంపిటిసిలు ,వార్డు సభ్యుల స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపద్యంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా సిద్దిమ్ చేయాలని కలెక్టర్ భారతి హొలీ కెరీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ భవన సముదాయం లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహన అధికారి నరేందర్ తో పాటు కలిసి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా తయారీ పై సమీక్షలు నిర్వహించారు. మందమర్రి మండలం చిర్ర కుంట ,భీమారo మండలం మద్దికల్ ఎంపిటిసి స్థానాలు ,9 సర్పంచ్ , 367 మంది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 388 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వారు తెలిపారు.