- తెలంగాణ రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలను రచ్చబండ ద్వారా ప్రజల లోనికి తీసుకెళ్దాం.
- కురవి టౌన్ ప్రెసిడెంట్ నారాయణ రాజేందర్ కుమార్.
మహా వెలుగు కురవి/ మే 21 రిపోర్టర్ చల్లా వేణు :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ ద్వారా ప్రజల వద్దకు తీసుకువెళ్లి అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని శనివారం కురవి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ 31 వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి రచ్చబండ కార్యక్రమాన్ని కురవి టౌన్ ప్రెసిడెంట్ నారాయణ రాజేందర్ కుమార్ అధ్యక్షతన “రచ్చబండ” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సంపన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, తెలంగాణ ను కెసిఆర్ కుటుంబం దోచుకొని, మరో శ్రీలంక చేసిందన్నారు.
రైతులకు ఇస్తానన్న హామీలను తుంగలో తొక్కి ,రైతు అనుకూల రాష్ట్రమని చెప్పుకుంటూ ప్రగల్బాలు పడుతున్నాడని అన్నారు.
దళితులకు 3 ఎకరాలభూమి, దళిత బంధు, రైతుబంధు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు లక్ష రూపాయలు మాఫీ లాంటి అనేక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అయ్యాడని, కుటుంబ పాలన లో తన కుటుంబం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిధులు ,నియామకాలు పూర్తిస్థాయిలో సమకూరాయని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ప్రభుత్వం ఆదాయం వనరులను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని, అది చాలక ప్రభుత్వ భూములను అమ్మే ఆలోచనలో ఉన్నాడని, ప్రజలను అప్రమత్తం చేసి ప్రభుత్వ భూములను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. బండి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రజనీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి అవిరే మోహన్ రావు, సీనియర్ నాయకులు మాలోతు లింగ్య నాయక్, కురుమ దామోదర్, గడిల బిక్షపతి, ఇస్లావత్. సుధాకర్, మలోతు వీరన్న, నరెడ్ల వెంకట్ రెడ్డి, మలిషెట్టి వేణు,
మోగిలిచేర్ల నాగేశ్వర్ రావు, భూక్యా భద్రు నాయక్, బానోత్ రమేష్ నాయక్, తరాల వీరభద్రం, అంబటి గోవర్ధన్,కొర్నీ అనిల్, చిన్నం గణేష్, దుంపటి వీరన్న, రామ్మూర్తి నాయక్, లక్ష్మణ నాయక్,కామిండ్ల ఆనందం,మూడ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
