టేకు చెట్లను కొడుతున్నారు..

  • తాత్కాలిక సిబ్బంది అండదండలతో టేకు చెట్ల నరికివేత
  • ఉన్నత స్థాయి అధికారుల నిర్లక్ష్యం
  • చోద్యం చూస్తున్న అటవీశాఖ అధికారులు

మహా వెలుగు ,మంచిర్యాల 22 : మంచిర్యాల జిల్లా భీమారo లో టేకు వనం ను యథేచ్ఛగా కొడుతున్నారు.  గత నెల పది రోజుల్లో ఇప్పటికే రూ. లక్ష ఇరవై వేల టేకు కలపను అధికారులు పట్టుకోగా శనివారం మరింత కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. బీట్ అధికారికి పట్టుబడిన కలపను ద్విచక్రవహనంపై స్థానిక డిపోకు తరలిస్తున్న ఫోటోలు మహా వెలుగు click అనిపించింది.

గత కొంతకాలంగా ఇక్కడ కలపను యథేచ్ఛగా కొడుతున్నారు.  అటవీశాఖ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు.  భీమారo , ఎల్కేస్వరం లో టేకు చేట్లు ఎక్కువ ఉండడంతో ఇక్కడ వన మేధం గత కొంతకాలంగా  జరుగుతుంది. అయిన  సంబంధించిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం అటు వైపుగా ఆలోచన సైతం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

అటవీ శాఖ ఇంటి దొంగల పనే

కాగా భీమారం అటవీశాఖలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. ఇక్కడ పనిచేసే తాత్కాలిక సిబ్బంది దీనికి ముఖ్య కారణం అని ఆరోపణలు సైతం బలంగా ఉన్నాయి. అయినా ఉన్నత స్థాయి అధికారులు మాత్రం  నిమ్మకు నీరెంతనట్లు వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతున్నది. కిందిస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అప్పటికి పై అధికారుల అండతోనే ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారని  మండలంలో పుకార్లు షికార్లు అవుతున్నాయి.

భీమారం ఎల్ కేశ్వరం బిట్ల లో ఇప్పటికే అత్యధిక శాతం టేకు చెట్లను ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ నామమాత్రపు ఫైన్ లు వేసి  అధికారులు కలపను స్వాధీనం చేసుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.  గతంలో సైతం ఇక్కడ నుండి అత్యధిక కలప స్మగ్లింగ్ కగా ఇప్పుడు కుడా టేకు చెట్లను నరికి తరలిస్తున్నారు.

అంత విలువ అయిన టేకు కలప ఎక్కడికి పోతుంది

భీమారo బిట్ తో పాటు ,ఎల్కేశ్వరం బీట్ లో  సైతం కలప అధికంగా ఉండటం తో ఇక్కడ సంగ్మార్లు టేకు వనాలపై కన్ను వేశారు. విలువ అయిన టేకు కలపను ఇక్కడ నుండి తరలిస్తున్నారు. అధికారుల కనుసన్నుల్లోనే ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు ప్రచారం సైతం జరుగుతుంది. అయిన అటవీశాఖ అధికారులు మాత్రం ఏమి తెలియదు అన్నట్లు గా తమ పనిని చేసుకుంటా వెళ్తున్నారు.