- బెల్లంపల్లి, చెన్నూర్ రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్ళ లాంటివి.
- బెల్లంపల్లి అభివృద్ధి కి సహకరిస్తా….
- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మహా వెలుగు 23 : టూరిస్ట్ నాయకులతో ఈ ప్రాంత ప్రజలకు ఒరిగేదేమీ లేదని ,గత పాలకుల కబంధ హస్తాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం బెల్లంపల్లి నియోజకవర్గానికి స్వాతంత్రం తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ అండ్ బి నుండి అంకుశం వరకూ రూ.1.20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి శంకుస్థాపనలు చేశారు.
రూ. 1500 కోట్లతో వార్ధా నది పై నిర్మించే బరాజ్ తో బెల్లంపల్లి నియోజకవర్గంలో 55 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు బాల్క సుమన్ తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బెల్లంపల్లి అభివృద్ధి లో పయనిస్తుందని ,విపక్షాల దొంగ పాదయాత్రలతో పొర్లుదండాలుతో నిధులు రావని ఎమ్మెల్యే కృషితోనే వివిధరకాల నిధులతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు పాత్ర, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
