గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలి

  • తెలంగాణ గిరిజన సంఘం కొరవి మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం

మహావెలుగు కురవి/మే 23 రిపోర్టర్ చల్ల వేణు : కురవి మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కురవి తాహాసిల్దార్ ఇమాన్యుల్ కి వినతిపత్రంను అందజేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ … గిరిజన తండాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అని వారన్నారు. కెసిఆర్ పాలనలో 8 సంవత్సరాల నుండి కనీసం ఒక్కరు కూడా పింఛన్లు ఇవ్వలేదని రేషన్ కార్డులు దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నా. నేటి వరకు ఇవ్వలేదని. ట్రైకర్ లో దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు నేటికి లోన్లు మంజూరు చేయలేదని తండాలలో మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని. అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ వెంటనే మంజూరు చేయాలి అని. గిరిజనుల కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని. వారన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు మా లోతు కిషన్ నాయక్. ధరావత్ లక్ష్మ. రవి విజయ్ తదితరులు పాల్గొన్నారు.