వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్, 23.: పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా కేంద్రంలో అటవీశాఖ కార్యాలయం – పోస్టాఫీసు ప్రక్కన ఉన్న జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా కలెక్టర్ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను సంభందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ప్రథమ భాష పరీక్ష జరుగుతున్నదని, 190 మంది పరీక్ష రాయాల్సి ఉండగా వంద శాతం హాజరు అయ్యారని, ఎవరు గైర్హాజరు కాలేదనిఅధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.
ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఈ.ఓ. ఎం.డి.అబ్దుల్ హై, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మధు, డిపార్ట్మెంట్ అధికారి వహీద్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారి డి.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్:
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న ఫాతిమా స్కూల్ పరీక్షా కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చీఫ్ సూపరింటెండెంట్ వి.బాలాజీ, డిపార్ట్మెంట్ అధికారులు కె.బిక్షం, జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.