తల్లి తండ్రి లేని యువతికి “బాల్క ఫౌండేషన్ అండ”

  • పేద యువతికి వివాహం జరిపించిన “బాల్క ఫౌండేషన్”
    మహా వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపెల్లి గ్రామానికి చెందిన తుంగపిండి శంకరయ్య – లక్ష్మి లు గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు.
  • వారికి కూతురు తుంగపిండి మౌనిక ఉండగా నిరుపేద యువతి కావడంతో స్థానిక సర్పంచ్ మేడి రవి ,జైపూర్ జడ్పీటీసీ మేడి సునీత – తిరుపతిల అధ్యర్యంలోబాల్క ఫౌండేషన్ సహకారం తో బంధువులు గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా వివాహాo జరిపారు. ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు అక్కడికి వచ్చిన ప్రజలు ,బందువులు యువ జంట ధన్యవాదాలు తెలిపారు.