మహా వెలుగు, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కీచక వీఆర్వో బయట పడ్డాడు. సిట్టింగ్ స్క్వాడ్ గా విధులు నిర్వహిస్తున్న వీఆర్వో అభం శుభo తెలియని విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గత మూడు రోజులుగా ఇలానే ” కీచక ఉపాద్యాయుడు” చేస్తుండటం తో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ లను ఆశ్రయించారు. జిల్లా లోని చెన్నూర్ సాంఘిక సంక్షేమ పాటశాల పదో తరగతి పరీక్ష కేంద్రoల్లో వీఆర్వో చంద్రమౌలి విధులు నిర్వహిస్తున్నారు. ఆడపిల్లల భుజం పై చేతులు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పదో తరగతి పరీక్ష రాస్తానని నీకేం ఇబ్బంది లేదని తానే అంత చూసుకుంటానని చెప్పాడు. దీనితో భయపడిన విద్యార్ధిని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. మూడు రోజులుగా ఇలాగేనే వేధిస్తున్నాడని చెప్పడటం తో విద్యార్థిని తల్లిదండ్రులు ,బందువులు వీఆర్వో ను నిలదీశారు. కాగ మైనర్ విద్యార్థిని పట్ల ఒక్క పరీక్ష సెంటర్ లో ఇలా ప్రవర్తించిన వీఆర్వో చంద్రమౌళి ఓయ్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.